![]() |
![]() |
\
ఈ ఏడాది ఫిబ్రవరి 26న రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే.. చెక్, A1 ఎక్స్ ప్రెస్. యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన చిత్రం చెక్. చెస్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నితిన్ చదరంగ ఆటగాడిగా దర్శనమివ్వనున్నారు. ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 26న థియేటర్స్ లో సందడి చేయనుంది.
కట్ చేస్తే.. అదే రోజు సందీప్ కిషన్ హీరోగా నటించిన A1 ఎక్స్ ప్రెస్ రిలీజ్ కానుంది. డెన్నీస్ జీవన్ డైరెక్ట్ చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో సందీప్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నారు. ప్రచార చిత్రాలతో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాపై సందీప్ చాలా ఆశలనే పెట్టుకున్నారు.
మరి.. చెస్ వర్సెస్ హాకీ అన్నట్లుగా ఉన్న ఫిబ్రవరి 26.. ఎవరి కెరీర్ కి ప్లస్ గా నిలుస్తుందో తెలియాలంటే అప్పటివరకు వేచిచూడాల్సిందే.
చెక్ లో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ నాయికలుగా నటించగా.. A1 ఎక్స్ ప్రెస్ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.
![]() |
![]() |