![]() |
![]() |

సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయగా తెరంగేట్రం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. కథానాయికగానే చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటికీ.. క్రమంగా విలన్ అండ్ క్యారెక్టర్ రోల్స్ కి షిష్ట్ అయ్యారు వరలక్ష్మి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్నారు ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
రీసెంట్ గా క్రాక్ లో జయమ్మ పాత్రలో విలనిజాన్ని పండించి మెప్పించిన వరలక్ష్మి.. ఈ నెలలో నాందితో పలకరించనున్నారు. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ వకీల్ పాత్రలో దర్శనమివ్వనున్నారు. ప్రచార చిత్రాలు చూస్తే.. మరో విషయమున్న వేషంలోనే వరలక్ష్మి కనిపించనున్నట్లు స్పష్టమవుతోంది. మరి.. క్రాక్ తరహాలోనే నాందితోనూ నటిగా మంచి మార్కులు సంపాదించుకుంటారేమో చూడాలి.
కాగా, విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన నాంది ఫిబ్రవరి 19న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |