![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి 2021 ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒకే క్యాలెండర్ ఇయర్ లో రెండు మల్టిస్టారర్స్ తో సందడి చేయనున్నారు చరణ్. కేవలం ఐదు నెలల గ్యాప్ లో ఈ రెండు మల్టిస్టారర్స్ తెరపైకి రానుండడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో కలసి రామ్ చరణ్ నటిస్తున్న మల్టిస్టారర్ ఆచార్య. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి విజనరీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వేసవి కానుకగా మే 13న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
అలాగే యంగ్ టైగర్ యన్టీఆర్ తో రామ్ చరణ్ కలసి నటిస్తున్న పిరియడ్ డ్రామా.. ఆర్ ఆర్ ఆర్. ఇందులో చరిత్ర పురుషులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల్లో చరణ్, తారక్ దర్శనమివ్వనున్నారు. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ అక్టోబర్ 13న దసరా కానుకగా జనం ముందుకు రానుంది.
అటు ఆచార్య, ఇటు ఆర్ ఆర్ ఆర్.. ఈ రెండు మల్టిస్టారర్స్ పై మెగాభిమానులకే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమ వర్గాల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.
మొత్తమ్మీద.. చరణ్ కి 2021 మల్టిస్టారర్ ఇయర్ గా గుర్తుండిపోనుందన్నమాట.
![]() |
![]() |