![]() |
![]() |

యాంకర్ సుమ టైమింగ్‌కి అందు కోవడం ఎవరి వల్లా కాదన్నది చాలా మందికి తెలిసిందే. ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 4లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించిన సందర్భంలో కింగ్ నాగ్‌నే గుక్క తిప్పుకోనివ్వకుండా లాక్ చేసి స్టేజ్ పై నుంచి సైడయ్యేలా చేసింది. అలాంటి సుమ స్టార్ మా కోసం `స్టార్ట్స్ మ్యూజిక్`పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌లతో ఈ ప్రోగ్రామ్‌ని రీ లాంఛ్ చేశారు.
ఈ సండే `కార్తీకదీపం` టీమ్‌తో స్పెషల్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో దీప ( ప్రేమి వైద్యనాథ్) మినహా నిరుపమ్, ఇద్దరు పిల్లలు, తల్లి, అత్త పాత్రలు చేసిన వారితో పాటు మోనిత పాత్ర ధారి కూడా పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమో స్టార్ మా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ షోలో డాక్టర్ బాబు నిరుపమ్‌తో సుమ ఓ ఆట ఆడేసుకుంది.
దీపని ఎందుకు ఏడిపిస్తున్నావని కత్తి పట్టుకుని వెంటపడింది. అపరిచితుడు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన సుమ డాక్టర్ బాబు మీకు కుంభీ పాకమే అంటూ కంగారు పెట్టేసింది. నేను సీరియల్స్‌లో దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్ట్రీ రిపీట్ డాక్టర్ బాబు... అంటూ సుమ చేసిన హంగామా నవ్వులు పూయిస్తోంది. ఈ ఎపిసోడ్‌ని మీరూ ఎంజాయ్ చేయాలంటే ఈ సండే 12 గంటలకి స్టార్ మాని ట్యూన్ చేసుకోండి.
![]() |
![]() |