![]() |
![]() |

బుల్లితెర సీరియల్ 'కార్తీక దీపం' రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ శుక్రవారం ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారబోతోంది. హిమని ఇంటికి తీసుకురావాలని, తద్వారా కార్తీక్ మనసు గెలుచుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించిన హిమని అనాధాశ్రమం నుంచి తీసుకొచ్చామని లాయర్ చెప్పినట్టుగా మోనిత ఓ ఫేక్ సర్టిఫికెట్‌ని సృష్టించి అందజేస్తుంది. అయితే నీకు, కార్తీక్‌కి మధ్య ప్రేమని, కానీ రిలేషన్ షిప్‌ని గాని తాను గమనించలేదని లాయర్ మోనితతో చెప్పి షాకిస్తుంది.
దీంతో ఆలోచనలో పడిన మోనిత ఆలోచనలో పడుతుంది. కార్తీక్‌ని పూర్తిగా తనవైపు ఎందుకు తిప్పుకోలేకపోతున్నానని ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇదే క్రమంలో దీప నుంచి తప్పించుకోవడం కోసం కార్తీక్ తనని ఓ పావులా వాడుకుంటున్నాడా?.. అలా అయితే తనని చంపి నేను చస్తానని చెబుతుంది మోనిత.
ఇదిలా వుంటే కార్తీక్‌కి ఎలాగైనా మోనిత విషయం చెప్పాలని తన బండారం బయటపెట్టాలని దీప నిర్ణయించుకుంటుంది. ఇంతకీ కార్తిక్ ఎక్కడున్నాడా? అని ఫోన్ చేస్తుంది. తను ఇంట్లో కానీ, హాస్పిటల్‌లో కానీ లేదడని తెలుసుకుని మోనిత ఇంటికి బయలుదేరుతుంది దీప. కార్తీక్ కారుని మోనిత ఇంటి ముందు చూసి దీని ఇంటికి రాకపోతే ఏం కొంపలు మునిగినట్టు అంటూ నిట్టూరుస్తుంది. ఈ క్రమంలో డాక్టర్ బాబుతో మోనిత వ్యవహారాన్ని దీప చెప్పేస్తుందా? లేదా అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |