![]() |
![]() |

గత ఏడాది ఫిబ్రవరిలో భీష్మతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో నితిన్.. ఈ సంవత్సరం ఫిబ్రవరికి చెక్ తో పలకరించబోతున్నారు. తొలుత ఫిబ్రవరి 19న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రకటించినా.. ఇప్పుడది ఫిబ్రవరి 26కి వాయిదా పడింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రిలీజ్ డేట్ మారినా తనకు కలిసొచ్చిన కథానాయికల నుంచి మాత్రం పోటీ తప్పడం లేదు నితిన్ కి.
ఆ వివరాల్లోకి వెళితే.. చెక్ కి తొలుత ప్రకటించిన రిలీజ్ డేట్ ఫిబ్రవరి 19 విషయానికి వస్తే.. సరిగ్గా అదే రోజున రష్మిక కన్నడ అనువాద చిత్రం పొగరు విడుదల కాబోతోంది. దీంతో భీష్మ జోడి (నితిన్, రష్మిక)కి పోటీ తప్పదనుకున్నారు అంతా. అయితే అనూహ్యంగా ఫిబ్రవరి 26కి చెక్ వాయిదా పడింది. కట్ చేస్తే.. ఇప్పుడదే రోజు నితిన్ హిట్ పెయిర్ అయిన నిత్యా మీనన్ నుంచి కొత్త చిత్రం నిన్నిలా నిన్నిలా రిలీజ్ కాబోతోంది. అంటే.. రిలీజ్ డేట్ మారినా నితిన్ కి తన లక్కీ హీరోయిన్ నుంచి పోటీ తప్పడం లేదన్నమాట.
మొత్తమ్మీద.. రష్మికతో పోటీ మిస్ అయినా.. నిత్యా మీనన్ రూపంలో నితిన్ కి చెక్ తప్పడం లేదు. మరి.. ఈ ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ లో ఎవరు విన్నర్ అవుతారో చూడాలి.
![]() |
![]() |