![]() |
![]() |

ఈటీవీలో హాట్ ఫేవరేట్ షో `ఢీ చాంపియన్స్`. దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, హీరోయిన్‌లు ప్రియమణి, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. హాట్ యాంకర్ రష్మీ గౌతమ్, దీపికా పిల్లి టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తుంటే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది తమదైన శైలి పంచ్‌లతో ఆకట్టుకుంటున్నారు.
తాజాగా రిలీజైన ఈ ప్రోగ్రామ్ ప్రోమో రచ్చ చేస్తోంది. వీరంతా నైన్టీస్‌కి వెళ్లిపోయారు. అనాటి తరల తరహాలో కాస్ట్యూమ్స్ మేకప్ చేసుకుని స్టేజ్‌ని అదరగొట్టేస్తున్నారు. ఆడిపాడ ఆద్యంతం స్టేజ్‌ని ఓ రేంజ్‌లో హోరెత్తించారు. అలనాటి హీరోయిన్ తరహాలో ఎల్లో కలర్ గౌన్‌లో ముస్తాబై వచ్చింది రష్మీ గౌతమ్.. అప్ టూ బాటమ్ రెడ్ కలర్ డ్రెస్‌లో బెల్ బాటమ్ ప్యాంట్ ధరించి నైన్టీస్ హెయిర్ స్టైల్‌తో సుడిగాలి సుధీర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
మధ్యలో హైపర్ ఆది వేసిన పంచ్‌లు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలతో కలిసి వేసిన స్టెప్పులు.. ఏ ఎన్నార్ తరహాలో వారిని శేఖర్ మాస్టర్ కొడితే ఎగిరి గంతేసిన తీరు నవ్వులు పూయిస్తోంది. ఈ హుషారులో వచ్చే బుధవారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో సందడి చేస్తోంది.
![]() |
![]() |