![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజకి అచ్చొచ్చిన దర్శకుల్లో ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో ఐదు చిత్రాలు రాగా.. వాటిలో తొలి మూడు సినిమాలు (ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి) బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆపై వచ్చిన నాలుగో చిత్రం నేనింతే ఆశించిన విజయం సాధించకపోయినా.. రవితేజకి ఉత్తమ నటుడిగా తొలి నంది అవార్డుని అందించింది. ఇక ప్రీవియస్ మూవీ దేవుడు చేసిన మనుషులు అయితే తీవ్రంగా నిరాశపరిచింది.
కట్ చేస్తే.. దాదాపు తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రానుందని టాక్. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని వినికిడి. త్వరలోనే రవితేజ, పూరి ఆరో కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.
కాగా, ప్రస్తుతం ఖిలాడితో రవితేజ, లైగర్ తో పూరీ జగన్నాథ్ బిజీగా ఉన్నారు. మే 28న ఖిలాడి థియేటర్స్ లో సందడి చేయనుండగా, ఈ ఏడాది ద్వితీయార్ధంలో లైగర్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
![]() |
![]() |