![]() |
![]() |

బిగ్‌బాస్ సీజన్ 4 ఇటీవలే ముగిసింది. లాక్‌డౌన్ కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ రియాలిటీ షో విన్నర్‌గా 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' ఫేమ్ అభిజీత్ నిలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఎక్కువ శాతం కంటెస్టెంట్‌లుగా తెలియని ముఖాలే కనిపించాయి. అయితే ముందు విమర్శలు వినిపించినా తరువాత రసవత్తర మలుపులు తిరగడంతో టీఆర్పీ భారీ స్థాయిలో పెరిగిపోయి ఫైనల్‌గా సీజన్ 4 సక్సెస్ అయింది.
గత సీజన్ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని సీజన్ 5ని మనరింత స్పైసీగా వుండేలా హాట్ బ్యూటీలతో ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే 60 మందితో హిట్ లిస్ట్‌ని ఫైనల్ చేసిన నిర్వాహకులు అందులోంచి ఇటీవలే షణ్ముఖ్ జస్వంత్ అనే యూట్యూబ్ డ్యాన్సర్‌ని ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో హాట్ అండ్ బోల్డ్ యాంకర్ కీర్తి రెడ్డిని కూడా కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ టీమ్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఈ సీజన్ కి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారట. గత సీజన్‌లకి మించి సీజన్ 5ని మరింతగా హీటెక్కించి హాట్ కంటెంట్, లవ్‌స్టోరీలతో రసపట్టుగా నడిపించబోతున్నారట. ఉత్తరాదిలో సల్మాన్ హోస్ట్‌గా వ్యవరిస్తున్న బిగ్ బాస్‌లో ఘాటు ప్రేమాయణాలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో తెలుగు బిగ్‌బాస్ ని కూడా సీజన్ 5 నుంచి హాటు ప్రేమాయణాలతో హీటెక్కించాలనుకుంటున్నారట.
![]() |
![]() |