![]() |
![]() |

తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఇమేజ్ ఉన్న సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు హీరోగా రూపొందుతోన్న బహు భాషా చిత్రం 'మానాడు'. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందిస్తున్నారు. వి హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేశ్ కామాచి నిర్మిస్తున్నారు. రూ. 125 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం తయారవుతోంది.
'మానాడు' తెలుగు వెర్షన్ టీజర్ మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల కానుంది. ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 2:34 గంటలకు ఈ టీజర్‌ను రవితేజ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో శింబు ముస్లిం క్యారెక్టర్‌లో నటిస్తుండటం గమనార్హం. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్‌కు అమేజింగ్ రెస్పాన్స్ లభించింది.
కాగా సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ. చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, ఎ. కరుణాకరన్ ఈ చిత్రంలో నటిస్తుండడం ఓ విశేషం. తమ చిత్రం 'మానాడు' తెలుగు టీజర్‌ను... తాజాగా 'క్రాక్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయనుండడంపై దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు!

![]() |
![]() |