![]() |
![]() |
.jpg)
కరోనా పాజిటివ్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నా.. తన కొత్త చిత్రాలపై మాత్రం కథనాలు ఆగట్లేదు. 'ఆర్ ఆర్ ఆర్', 'ఆచార్య' వంటి మల్టిస్టారర్ మూవీస్ తరువాత చరణ్.. 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ మూవీ చేయబోతున్నారంటూ ఒకవైపు వార్తలు వినిపిస్తూ ఉండగా.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథనం వెలుగులోకి వచ్చింది.
అదేమిటంటే.. కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన 'ఖైదీ'తో తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో చరణ్ ఓ మూవీ చేసే అవకాశముందట. లోకేష్ శైలి కథతోనే రియలిస్టిక్ అప్రోచ్ తో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని బజ్. మరి.. 'ఖైదీ' దర్శకుడితో 'ఖైదీ' (మెగాస్టార్ చిరంజీవి) తనయుడు చేయనున్న ఈ సినిమా వార్తలకే పరిమితమో లేదంటే కార్యరూపం దాల్చుతుందో చూడాలి.
కాగా, లోకేష్ కనకరాజ్ తాజా చిత్రం 'మాస్టర్' జనవరి 13న విడుదల కాబోతోంది. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ తో లోకేష్ చేస్తున్న 'విక్రమ్' చిత్రం సెట్స్ పై ఉంది.
![]() |
![]() |