![]() |
![]() |

మాస్ మహరాజా రవితేజ సరసన కనువిందు చేసిన నాయికల్లో రాశీఖన్నా ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'బెంగాల్ టైగర్', 'టచ్ చేసి చూడు' చిత్రాలు వచ్చాయి. అలాగే రవితేజ కథానాయకుడిగా నటించిన 'రాజా ది గ్రేట్' లోనూ ఓ పాటలో తళుక్కున మెరిసింది రాశి. కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి రవితేజతో జట్టుకట్టనుందట ఈ అమ్మడు.
ఆ వివరాల్లోకి వెళితే.. 'వీర' తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం 'ఖిలాడి'. మాస్ మహారాజా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. కథానుసారం ఇందులో ఓ ప్రత్యేక గీతానికి స్థానముందట. ఆ పాట కోసం రాశిని ఎంపిక చేశారని టాక్. త్వరలోనే 'ఖిలాడి'లో రాశీఖన్నా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం రాశి చేతిలో సైతాన్ కా బచ్చా, తుగ్లక్ దర్బార్, మేధావి, అరణ్ మణై 3 వంటి తమిళ చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనే ఈ సినిమాలు తెరపైకి రానున్నాయి.
![]() |
![]() |