![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ 'సైరా.. నరసింహారెడ్డి'లో ఓ కథానాయికగా నటించారు లేడీ సూపర్ స్టార్ నయనతార. కట్ చేస్తే.. మరోసారి చిరు సినిమాలో భాగం కానున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో సంచలన విజయం సాధించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ స్టారర్ 'లూసీఫర్'.. తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 'హనుమాన్ జంక్షన్' ఫేమ్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో సీఎం కూతురి పాత్రలో నయన్ నటించబోతోందట. ఇప్పటికే ఈ మేరకు సంప్రదింపులు జరిగాయని టాక్.
మోహన్ రాజా బ్యాక్ టు బ్యాక్ తమిళ్ మూవీస్ 'తని ఒరువన్' ('ధృవ' మాతృక), 'వేలైక్కారన్'లో నయనతార నాయికగా నటించారు. ఈ నేపథ్యంలోనే.. నయన్ తో రాజా చర్చలు జరిపారని, లేడీ సూపర్ స్టార్ కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. త్వరలోనే 'లూసీఫర్' రీమేక్ లో నయనతార ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న 'లూసీఫర్' రీమేక్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
![]() |
![]() |