![]() |
![]() |

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మళ్ళీ రావా(2017)తో దర్శకుడిగా తొలి అడుగేసిన గౌతమ్ తిన్ననూరి.. ఆపై ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ(2019)తో మరింత గుర్తింపుని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జెర్సీని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న గౌతమ్.. ఆ నెక్స్ట్ తెలుగులోనే తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సారి ఓ స్టార్ హీరోతో గౌతమ్ సినిమా ఉంటుందని కథనాలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ మరెవరో కాదు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.
చాన్నాళ్ళ క్రిందటే.. చరణ్, గౌతమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయిందని.. జూన్ లేదా జూలైలో సెట్స్ పైకి వెళ్ళే ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తారని బజ్. అంతేకాదు.. ఇదో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే చరణ్, గౌతమ్ కాంబినేషన్ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
![]() |
![]() |