![]() |
![]() |

కథానాయికగా తాప్సీది పదేళ్ళ ప్రస్థానం. తెలుగు సినిమాతోనే నాయికగా కెరీర్ ని ఆరంభించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. అక్కడ ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో హసీన్ దిల్ రుబా, రష్మి రాకెట్, లూప్ లపేటా వంటి మహిళా ప్రాధాన్య చిత్రాలున్నాయి.
ఇదిలా ఉంటే.. బైలింగ్వల్ మూవీ 'గేమ్ ఓవర్' తరువాత మళ్ళీ తెలుగు తెరపై సందడి చేయని తాప్సీ.. త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో పలకరించనుందట. ఆ సినిమా మరేదో కాదు.. దర్శకుడు తేజ తెరకెక్కించనున్న 'అలివేలుమంగ వేంకటరమణ'. ఇందులో అలివేలు పాత్ర కోసం పలు కథానాయికల పేర్లు వెలుగులోకి రాగా.. చివరాఖరికి ఆ అవకాశం తాప్సీ చెంతకు చేరిందని టాలీవుడ్ టాక్. త్వరలోనే తాప్సీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, గోపీచంద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని.. ఇప్పుడా పాత్రలో ఓ తమిళ హీరో కనిపిస్తారని బజ్. త్వరలోనే ఈ సినిమా తాలూకు షూటింగ్ ప్రారంభం కానుంది.
![]() |
![]() |