![]() |
![]() |

బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే మరో పది రోజుల్లో జరగబోతోంది. ఒక్క అఖిల్ సార్ధక్ మినహా మిగతా కంటెస్టెంట్లందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. వారికి బిగ్ బాస్ ఓ స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. దాని ద్వారా వాళ్లను తామేమిటో నిరూపించుకొమ్మని చెప్పాడు. ఫస్ట్ లెవల్లో బిగ్ బాస్ ఇచ్చిన రాజా రాణి టాస్క్‌లో ప్రతి ఒక్కరూ రెచ్చిపోయి యాక్ట్ చేశారు. సొహైల్ రాజ్యంలో అరియానా బాగా ఎంటర్టైన్ చేసింది. హారిక పాలనలో వినోదానికి బదులు తగాదాలు ఎక్కువగా నడిచాయి. అభిజీత్ కింగ్డమ్లో వినోదం లోపించింది. ఈరోజు సెకండ్ లెవల్ టాస్క్ ఇచ్చేందుకు బిగ్ బాస్ రెడీగా ఉన్నాడు. ఎవరికి ఎంత ఓపిక ఉందో చూద్దాం అంటూ నిర్వాహకులు ఇచ్చిన ప్రోమోలో అరియానాలో ఓపిక నశించి, కోపం వచ్చేలా చేయడానికి సొహేల్ చాలా ట్రై చేశాడు. ఆమెలో చలనం లేకపోవడంతో యాక్షన్‌లోకి దిగాడు.

అరియానాకు ఇష్టమైన డ్రస్సులు తీసుకొచ్చి దాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. నువ్వేం చేయవని ఆమెకు తెలుసులే అని హారిక అనడంతో సొహేల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. చేతిలో ఉన్న కప్పును పగలగొట్టేశాడు. అరియానాకు ఇష్టమైన బొమ్మను నలిపేశాడు. అతడి పనులు అరియానాకు కోపం తెప్పిస్తున్నా బయటకు కనిపించనీయలేదు. ఫస్ట్ లెవల్లో అరియానా రెచ్చిపోయిన దానికి ప్రతిగా సొహేల్ ఇది చేస్తున్నట్లుంది. ఈ టాస్క్ తర్వాత అరియానా, సొహేల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనేలా కనిపిస్తోంది. ఈ సెకండ్ లెవల్ టాస్క్‌లో ఎవరికి ఎక్కువ ఓర్పు ఉందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ వీక్షించాల్సిందే.

![]() |
![]() |