![]() |
![]() |

'ఛత్రపతి' వంటి బ్లాక్ బస్టర్ తరువాత మళ్ళీ 15 ఏళ్ళకు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో 'ఆర్‌ఆర్ఆర్' చేస్తున్నారు అందాల తార శ్రియా శరన్. కొమరం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆ ఇద్దరికీ గురువుగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కనిపించబోతున్నారు. కాగా అజయ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయనకు జోడీగా శ్రియ దర్శనమివ్వబోతున్నారు.
ఈ సినిమాలో తనకు తారక్, చరణ్ కాంబినేషన్‌లో సీన్స్ ఉండవని ఇప్పటికే వెల్లడించారు శ్రియ. అలాగే నో గ్లామర్.. నో రొమాన్స్.. నో రొమాంటిక్ సాంగ్స్.. అన్నట్లుగా ఈ పాత్ర సాగుతుందట. జస్ట్ 15 నిమిషాలు మాత్రమే స్క్రీన్ స్పేస్ ఉన్న రోల్ ఇదని.. అతిథి పాత్రే అయినా గుర్తుండిపోయేలా శ్రియ పాత్ర ఉంటుందని బజ్. మరి.. ఒకటిన్నర దశాబ్దం తరువాత జక్కన్న కాంబినేషన్‌లో శ్రియ చేస్తున్న ఈ చిత్రం తనకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
![]() |
![]() |