![]() |
![]() |

చిత్రలహరి, ప్రతిరోజూ పండగే.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో 2019 క్యాలెండర్ ఇయర్ లో సందడి చేసిన సుప్రీమ్ హీరో సాయితేజ్.. 2020 చివరలో సోలో బ్రతుకే సో బెటర్ అంటూ పలకరించబోతున్నాడు. డెబ్యూ డైరెక్టర్ సుబ్బు రూపొందించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్స్ లోకి రాబోతోంది. ఆపై దేవకట్టా కాంబినేషన్ లో పొలిటికల్ థ్రిల్లర్, వీరు పోట్ల కాంబినేషన్ లో ఓ పిరియడ్ ఫిల్మ్ తో ఎంటర్ టైన్ చేయబోతున్నాడు తేజ్.
అంతేకాదు.. మరో కొత్త చిత్రానికి కూడా తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ వివరాల్లోకి వెళితే.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ శిష్యుడు రామ్ ఇటీవల సాయితేజ్ ని సంప్రదించి ఓ స్టోరీ చెప్పాడట. అది నచ్చడంతో.. రామ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు వెంటనే ఓకే చెప్పాడట తేజ్. నక్షత్రం చిత్రీకరణ సమయం నుంచే తేజ్ తో రామ్ టచ్ లో ఉన్నాడని.. ఇప్పటికీ ఈ ఇద్దరి కాంబో సెట్ అవుతోందని టాలీవుడ్ బజ్. త్వరలోనే సాయితేజ్, రామ్ కాంబినేషన్ మూవీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |