![]() |
![]() |

నాగచైతన్య, సమంత మధ్య ప్రేమానుబంధాన్ని, వారు పంచుకొనే అనురాగాన్ని ప్రశంసించకుండా ఉండలేం. కపుల్ గోల్స్‌ను నెరవేర్చడంలో, తమ రొమాంటిక్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చడంలో ఆ జంట ఎప్పుడూ ముందుంటుంది. టాలీవుడ్‌కు చెందిన పవర్ కపుల్స్‌లో ఆ జంట ఒకటి. రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించిన చాట్ షో 'నంబర్ 1 యారి' వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో బాగా ప్రచారంలోకి వచ్చింది. అందులో తన స్నేహితురాలు, గాయని చిన్మయి శ్రీపాదతో కలిసి పాల్గొన్నారు సమంత. ఆ షోలో సమంత ఓ సందర్భంలో చెప్పిన మాట అందరికీ నవ్వు తెప్పించడమే కాకుండా, చైతన్యను ఆమె ఎలా ప్రేమిస్తుందో కూడా తెలియజేస్తుంది.
ఆ షోలో సమంతను రకరకాల ప్రశ్నలు వేసి, జవాబులు రాబట్టిన రానా ఒక రాపిడ్-ఫైర్‌ను నిర్వహించాడు. అందులో భాగంగా రానా సంధించిన ప్రశ్నలకు అంతే ఫైర్‌తో సమంత, చిన్మయి జవాబులిచ్చారు. అప్పుడే సరదాగా ఫ్లోలో నాగచైతన్యను తన 'పెట్' (పెంపుడు జంతువు)గా సంబోధించారు సమంత. ఆ వెంటనే రానా, చిన్మయితో పాటు తను కూడా బిగ్గరగా నవ్వేశారు. సాధారణంగా చైతూను సామ్ అలా పిలిచినందుకు అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవ్వాలి. కానీ అది సరదాగా సాగిన షో కావడం, ఫ్లోలో సమంత కూడా సరదాగానే చెప్పండంతో వారికి కోపం రాలేదు. పైగా చైతూను సామ్ ఎంత బాగా చూసుకుంటుందో అనే దానికి అది నిదర్శనమని కూడా వారు ఆనందించారు.
![]() |
![]() |