![]() |
![]() |

హైదరాబాద్ నగరంలో సెటిల్ అయిన ఉత్తరాది ఫ్యామిలీకి చెందిన మిహీకాను రానా దగ్గుబాటి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాది, ఉత్తరాది సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పూజలు సైతం రెండు సంప్రదాయాల ప్రకారం చేసుకుంటున్నారు.
తెలుగు సంప్రదాయం ప్రకారం కొన్ని కుటుంబాల్లో కొత్తగా పెళ్లయిన దంపతుల్లో అమ్మాయి చేత అట్లతద్ది చేయిస్తారు. ఉత్తరాది సంప్రదాయం ప్రకారం అయితే... మనకు అట్లతద్ది పండుగ అయిన తర్వాత రోజున కర్వా చౌత్ పండుగ చేస్తారు. మిహీకా బజాజ్ ఉత్తరాది అమ్మాయి కదా! అందుకని, నిన్న కర్వా చౌత్ సెలబ్రేట్ చేసుకున్నారు. రానా అత్తారింట్లో ఈ పూజ జరిగింది. రానా అత్తగారు బంటీ బజాజ్ అల్లుడు, అమ్మాయిని ఫోటోలు తీశారు. అవి మీరూ చూడండి!



![]() |
![]() |