![]() |
![]() |

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐదు సంవత్సరాల కుమార్తె జివాపై సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకర వ్యాఖ్యలపై అందరూ షాకవుతున్నారు. అతని అభిమానులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ధోని కుమార్తె బెదిరింపులకు గురైన తర్వాత నటి నగ్మా ట్విట్టర్ ద్వారా స్పందించారు. నగ్మా ఈ విషయంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాక, అలాంటి వారి మనస్తత్వాన్ని కూడా ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.
ఇకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన నగ్మా తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేస్తూ న్యూస్ లింక్ షేర్ చేశారు. "ఈ రోజు మనం ఒక జాతిగా ఎక్కడ నిలబడతాం?" అని ఆమె అందులో ప్రశ్నించారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన తరువాత, ధోని ఐదేళ్ల కుమార్తెపై కొంతమంది నెటిజన్లు ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు. "మిస్టర్ ప్రధాని, మన దేశంలో ఏం జరుగుతోంది?" అంటూ ప్రధానిని సూటిగా ప్రశ్నించిన నగ్మా 'బేటీ బచావో-బేటి పఢావో' అనే ప్రధాని నినాదాన్ని హ్యాష్‌ట్యాగ్‌గా జోడించారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు చేతిలో మహేంద్ర సింగ్ ధోని జట్టు చెన్నై సూపర్‌కింగ్స్ ఓటమి పాలవడంతో అభిమానులు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీని తరువాత, ధోని భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ట్రోల్ చేయడంతో పాటు వారి ఐదేళ్ల కుమార్తె జివా గురించి అసహ్యకర వ్యాఖ్యలు చేశారు.
నటి నుంచి రాజకీయ నాయకురాలిగా నగ్మా ప్రయాణం కొనసాగుతోంది. సౌత్ నుండి బాలీవుడ్ వరకు ఆమె అనేక చిత్రాల్లో నటించారు. తన కెరీర్‌లో చాలా హిట్ సినిమాలు ఇచ్చారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్ల జాబితాలో నగ్మా తప్పకుండా ఉంటారు. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. దాని ద్వారా ప్రతి విషయంపై నగ్మా తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు.
![]() |
![]() |