![]() |
![]() |

బాయ్‌ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరవాత రియా చక్రవర్తి జీవితం తల్లకిందులైంది. కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా, మరికొందరు ఆమెను దోషిగా చూడటం మొదలుపెట్టారు. మొదట రియా తన కుమారుడి డబ్బును అక్రమంగా ఇతర ఖాతాలకు మళ్లించిందని సుశాంత్ తండ్రి కె.కె. సింగ్ ఆరోపించారు. ఆ కేసు చేపట్టిన ఈడీ విచారణ చేసింది. అక్రమాలు జరగలేదని తేల్చింది. తరవాత డగ్ర్ కోణం పైకి వచ్చింది. అందులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రియా చక్రవర్తిని ఆరెస్ట్ చేశారు. 28 రోజులు జైలులో ఉన్న తరవాత ఆమెకు బెయిల్ రావడంతో ఇంటికి వెళ్లారు.
జైలు నుండి ఇంచికొచ్చిన తరవాత రియా చక్రవర్తి మాట్లాడిన మొదటి మాటలు ఏంటో తెలుసా? ‘‘ఎందుకు బాధగా ఉన్నావ్? ఈ పరిస్థితులపై ఫైట్ చేయడానికి మనం స్ట్రాంగ్‌గా ఉంటారు’’ – ఇవీ తల్లితో రియా చెప్పిన మాటలు! ఈ సంగతి రియా తల్లి సంధ్యా చక్రవర్తి చెప్పారు. కుమార్తె ఇంటికొచ్చిన తరవాత మౌనం వీడిన ఆమె, ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. రియా ఇంటికి వచ్చినప్పటికీ... ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇంకా జైలులో ఉన్నారు. అతనికి బెయిల్ రాలేదు.
![]() |
![]() |