![]() |
![]() |

తల్లిదండ్రులకు పిల్లలు అన్ని రకాల భావోద్వేగాలను తీసుకు వస్తారు. ఏ భార్యాభర్తలకైనా పిల్లలు కలిగి, వాళ్లను పెంచే దశ అనిర్వచనీయమైన అనుభూతులను ఇస్తుందనడంలో సందేహం లేదు. పాపో, బాబో ఇంట్లోకి వస్తే ఆ ఇల్లు ఎంత కళకళలాడుతుందో, ఎన్ని ఆనందాలు వస్తాయో అనుభవించిన వాళ్లందరికీ తెలుసు. పిల్లలు పలికే మొదటి మాట, వారు వేసే తొలి అడుగు.. ప్రతిదీ అపురూపమే. 'కేజీఎఫ్' స్టార్ యష్, అతని భార్య రాధికా పండిట్ ఇప్పుడు అలాంటి ఆనంద క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు.
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పాపులర్ సెలబ్రిటీ కపుల్స్‌లో యష్, రాధిక జంట ఒకటి. నవీన్‌కుమార్ గౌడ అలియాస్ యష్, తన భవిష్యత్ భార్య రాధికను తన పరిచయ చిత్రం 'మొగ్గిన మనసు'లో నటించేటప్పుడు తొలిసారి కలిశాడు. అయితే ఆ ఇద్దరూ కలిసి నటించిన మూడో సినిమా 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' చేసే టైమ్‌లో వారు డేటింగ్లో ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. 2016లో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2018లో రాధికకు తొలి బిడ్డగా ఐరా పుట్టింది. ఏడాది తిరిగేసరికల్లా యష్, రాధిక దంపతులు రెండోసారి అమ్మానాన్నలయ్యారు. యథర్వ్ వారి జీవితాల్లోకి కొత్తగా వచ్చాడు.
అక్టోబర్ 10న రాధికా పండిట్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో యష్, యథర్వ్‌కు చెందిన రెండు అందమైన వీడియోలను షేర్ చేసింది. వాటిలో యథర్వ్‌కు 'జానీ జానీ యస్ పాపా' రైమ్కు నేర్పుతున్నాడు యష్. ఆ రైమ్కు యథర్వ్ స్పందించి "హహ్హహ్హ" అనడం ముచ్చటగొలుపుతోంది. మధ్యలో ఐరా కూడా ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియోతో పాటు రాధిక "Lockdown diaries : One Johnny and Another (a rather impatient one)" అనే క్యాప్షన్ పెట్టింది.

![]() |
![]() |