![]() |
![]() |

బాలీవుడ్ నటి రిచా చాధా జాతీయ మహిళా కమిషన్ చర్యలను ప్రశ్నించింది. తను చేసిన ఫిర్యాదులో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని నటి సోషల్ మీడియా ద్వారా మహిళా కమిషన్‌ను కోరింది. రిచా రెండు ట్వీట్లలో కమిషన్‌ను కోరినప్పటికీ స్పందన రాలేదు. దీనిపై నటి తాప్సీ పన్నూ స్పందించి ఢిల్లీ వెళ్లి గొంతు ఎత్తాల్సి ఉంటుందని ఆమెకు సూచించింది.
వాస్తవానికి, కొన్ని రోజుల క్రితం, లైంగిక వేధింపులకు సంబంధించి దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నటి పాయల్ ఘోష్‌పై నటిపై రిచా చాధా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పాయల్ తన పేరును తప్పుగా అనవసరంగా లాగిందని రిచా చాధా తెలిపింది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుని, మహిళా కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేసింది. అయితే, ఇప్పుడు రిచా తన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని మహిళా కమిషన్‌ను అడుగుతోంది.
గమనించాల్సిన విషయమేమంటే, రిచా చాధా ట్వీట్ ద్వారా మహిళా కమిషన్‌కు ఈ ప్రశ్నలను వేసింది. అనురాగ్ కశ్యప్‌పై ఆరోపణలు చేసిన పాయల్ ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది. అవును, పాయల్ ఫొటోలను రిచా చాధా షేర్ చేసింది. ఇందులో ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మతో కలిసి ఉంది. అనురాగ్ కశ్యప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత, పాయల్ మహిళా కమిషన్ అధికారులను కలుసుకుని, సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసింది. ఇప్పుడు రిచా చాధా తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ మహిళా కమిషన్‌ను కోరింది.
"రేఖా శర్మ మామ్ ఈ పిక్చర్లను చూశాను. దర్శకుడిపై కేసులో నా పేరును తప్పుగా లాగిన విషయం నేపథ్యంలో సెప్టెంబర్ 22 న పాయల్‌పై ఫిర్యాదు చేశాను. కానీ మహిళా కమిషన్ నుండి నాకు ఎటువంటి సమాచారం రాలేదు. ఈ విషయంలో మీ ట్వీట్ ఆధారంగా, నా ఫిర్యాదు ఆమె ఫిర్యాదు కంటే ముందే నమోదైందని నేను భావిస్తున్నాను." అని ట్వీట్ చేసింది రిచా.

దీని తరువాత, ఆమె మరో ట్వీట్ చేసింది, అందులో మహిళా కమిషన్‌కు తాను చేసిన ఫిర్యాదు ఎక్నాలడ్జ్‌మెంట్ స్క్రీన్‌షాట్‌ను పంచుకుంది. రిచాకు మద్దతుగా రంగంలోకి దిగిన తాప్సీ పన్నూ, "మీ గొంతు వినిపించడానికి మీరు త్వరలో ఢిల్లీకి వెళ్లాలని నేను భావిస్తున్నాను." అంటూ సూచించి, మహిళా కమిషన్‌పై సెటైర్ వేసింది.
![]() |
![]() |