![]() |
![]() |

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలోని జ్యుడీషియల్ కోర్టు హిందీ నటి కంగనా రనౌత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించింది. న్యాయవాది ఎల్. రమేష్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టమని చెప్పింది. అసలు వివరాల్లోకి వెళితే...
సెప్టెంబర్ 21వ తేదీన కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న రైతులను ఉద్దేశించి కంగనా రనౌత్ ఒక ట్వీట్ చేశారు. అందులో తీవ్రవాదులు అనే పదం ఉపయోగించారు. రైతులను ఆమె తీవ్రవాదులు అన్నారని పలువురు మండిపడ్డారు. అయితే, ఆ తరవాత తాను తీవ్రవాదులు అన్నది రైతులను అని నిరూపిస్తే ట్విట్టర్ నుండి వైదొలుగుతానని కంగనా మరో ట్వీట్ చేశారు. మొదటి ట్వీట్ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కానుంది.
అసలు, కంగనా రనౌత్ ఏం ట్వీట్ చేశారనేది ఒక్కసారి చూస్తే.. " పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి దేశంలో అల్లర్లకు కారణమైన వ్యక్తులే, ఇప్పుడీ వ్యవసాయ బిల్లులపై కూడా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి దేశంలో ఆందోళనలు, భయాలు సృష్టిస్తున్నారు. వాళ్లు తీవ్రవాదులు" అని అన్నారు. ఆమె ట్వీట్ రైతుల మనోభావాలు గాయపరిచేలా ఉందని రమేష్ నాయక్ కోర్టును ఆశ్రయించారు.
![]() |
![]() |