![]() |
![]() |

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి థియేటర్లు తెరచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ రోజు 'కరోనా వైరస్'ను విడుదల చేస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. సో... లాక్‌డౌన్ తరవాత థియేటర్లలోకి వచ్చే తొలి తెలుగు సినిమా ఏది? అన్న ప్రశ్నకు సమాధానం లభించింది. హిందీలోనూ ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది.
హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్, నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్యా పాండే జంటగా నటించిన సినిమా 'ఖాలీ పీలి'. ఆల్రెడీ ఓటీటీలో విడుదలైంది. దీన్ని ఈ నెల 16న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన 'క పే రణసింగం' సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ రెండు సినిమాల హక్కులు జీ స్టూడియోస్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు థియేటర్లలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
![]() |
![]() |