![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 4లో ప్రేక్షకులను మెప్పించడానికి టీఆర్పీ పెంచుకోవడానికి కొత్తకొత్త ఎత్తుగడలు వేయాల్సి వస్తోంది. కిడ్నాపులు, హత్యలు, దొంగతనాలతో నెగిటివ్ లు ఎక్కువైన బిగ్ హౌస్‌లో 26వ రోజు డ్యాన్స్ క్లాస్ లు, ర్యాంప్ వాక్ లతో వినోదం పండించారు. వేకప్ సాంగ్ తో స్టెప్పులేసిన ఇంటిసభ్యులకు మార్నింగ్ మస్తీలో భాగంగా మెహబూబ్ డ్యాన్స్ నేర్పించాడు. ఇంటిసభ్యుల కంఫర్ట్ ప్రకారం, వారి మనస్తత్వానికి తగ్గట్టుగా వెరైటీగా డ్యాన్స్ స్టెప్పులు వేయించాడు. లాస్యతో చపాతీల స్టెప్పులు, అఖిల్ తో వర్కవుట్ స్టెప్పులు, అభితో కారు డ్రైవింగ్, అమ్మ రాజశేఖర్ తో కాంచన స్టెప్పులు వేయించాడు. గంగవ్వ, స్వాతి, కుమార్ సాయి, అరియానాతోనూ స్టెప్పులు వేయించి ఇంటి సభ్యులతో వారెవ్వా దిల్ సే మెహబూబ్ అనిపించాడు.
ఇంటిసభ్యులంతా హాల్ లో రిలాక్స్‌డ్‌గా కూర్చొని ఉన్నారు. బిగ్ బాస్ ఆదేశించగా కన్ఫెషన్ రూంలోకి అఖిల్ వెళ్లాడు. ఈ వారం రేషన్ మేనేజర్‌గా ఎన్నికైన అఖిల్‌కు రూ. 3200లకు లగ్జరీ బడ్జెట్ షాపింగ్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. ఇంటిసభ్యుల్లో ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు చొప్పున 16 వస్తువులు ఎంపిక చేయమని చెప్పగా లాస్యకు చికెన్ పచ్చడి, నోయల్‌కు బ్రెడ్, సోహైల్ కు నూడుల్స్ , మెహబూబ్ కు పోహ, మోనాల్ కు పన్నీర్, అమ్మ రాజశేఖర్ మాస్టర్‌కు శనగపిండి, గంగవ్వకు కార్నఫ్లెక్స్ కావాలంటూ బోర్డు పై రాశాడు. కన్ఫెషన్ రూం నుంచి బయటకు వచ్చిన అఖిల్ ను ఇంటిసభ్యులు కాసేపు ఆటపట్టించారు.
హౌస్ కెప్టెన్ కుమార్ సాయి ఇంటిసభ్యులందరికీ కొత్త బట్టలు వచ్చాయని, అవి ధరించి అందంగా ముస్తాబు కావాలన్న బిగ్ బాస్ ఆదేశాన్ని చదివి వినిపించాడు. స్టోర్ రూంలో ఉన్న చందన బ్రదర్స్ నుంచి వచ్చిన కొత్తబట్టలు, నగలు ధరించి అందరూ మిలమిలా మెరిసిపోయారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను సుజాత చదివింది. అందంగా ముస్తాబు అయిన ఇంటిసభ్యులంతా గార్డెన్ ఏరియాలో ఏర్పాటుచేసిన ర్యాంప్ పై నడవాలి. అమ్మయిలు, అబ్బాయిలు బ్యాచ్ గా ర్యాంప్ వాక్ చేసిన తర్వాత ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒకరిని ఎంపిక చేయాలి. గెలిచిన వారికి లక్షరూపాయల బహుమతి ప్రకటించాడు బిగ్ బాస్. "పిల్ల రేణుకా పిలగాడొచ్చిండే" అంటూ పాట ప్లే కాగా అబ్బాయిలు హావభావాలను ప్రదర్శిస్తూ ర్యాంప్ వాక్ చేశారు. ఆ తర్వాత "ఎంత సక్కగున్నావే లచ్చిమి" అంటూ మరోపాటలో అమ్మాయిలందరూ వయ్యారాలు వలకబోస్తూ ర్యాంప్ వాక్ చేశారు. గంగవ్వ ర్యాంప్ వాక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అమ్మాయిల నుంచి గంగవ్వను, అబ్బాయిల నుంచి అవినాష్ ను ఇంటిసభ్యులు ఎంపిక చేయగా వారిద్దరికీ చెరో లక్ష రూపాయల చెక్ అందించారు.
ఆ తర్వాత అవినాష్ ను అద్దంలా కూర్చోమని, అమ్మాయిలంతా అద్దం ముందు కూర్చోని తమ మనసులోని మాట చెప్పుకోవాలని బిగ్ బాస్ సూచించాడు. అవినాష్ తన ముందుకు వచ్చిన వారిని కామెంట్స్ చేస్తూ తనదైన శైలిలో కామెడీ పండించాడు. ఆ తర్వాత లాస్య, సుజాత, మోనాల్ కిచెన్ లో ఉండగా ర్యాంప్ వాక్ షో లో ఎవరూ ఎలా చేశారో అవినాష్ ఇమిటేట్ చేసి చూపించాడు. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ వీకెండ్ కావడంతో ఎలిమినేషన్ టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేది మెహబూబ్, హారిక, సోహైల్, మోనాల్, స్వాతి దీక్షిత్, అభిజిత్ లో ఎవరూ అనేది నెక్ట్స్ ఎపిసోడ్ లో తెలుస్తుంది.
![]() |
![]() |