![]() |
![]() |

గతేడాది దక్షిణాది ప్రేక్షకులను కథానాయిక అమలా పాల్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తెలుగులో 'ఆమె'గా విడుదలైన తమిళ సినిమా 'ఆడై'లో కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించారు. మరికొన్ని సన్నివేశాల్లో కేవలం లోదుస్తులు వేసుకుని మాత్రమే కనిపించారు. ఇప్పుడు ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తొలుత అమలా పాల్ పోషించిన పాత్రను హిందీలో శ్రద్ధా కపూర్ పోషిస్తారని వార్తలు వినిపించాయి. హిందీ రీమేక్ నిర్మాతలను ఆమెను సంప్రదించారు కూడా! కానీ, వర్కవుట్ కాలేదు. దాంతో నుష్రత్ భరూచా దగ్గరకు వెళ్లారు. ఆమెకు కథ నచ్చింది. దాంతో నటించడానికి అంగీకరించారని ముంబై వర్గాలు అంటున్నాయి. అయితే, ఇంకా సినిమాకి నుష్రత్ సంతకం చేయలేదట. అగ్రిమెంట్లు గట్రా పూర్తయిన తరవాత వచ్చే ఏడాది సినిమా చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |