![]() |
![]() |

కిల్లర్ కాయిన్స్ రెండో భాగంలో దివి, అరియానా, సోహైల్, నోయల్, అమ్మ రాజశేఖర్ అవుట్ అయ్యారు. ఆటలో ఉన్నవారికి సూచనలు ఇస్తూ ఎక్కువ పాయింట్లు ఉన్న వారిని టార్గెట్ చేయాలని అరియానా కామెంట్ చేసింది. దాంతో అరియానాపై సుజాత ఫైర్ అయ్యింది. రన్నింగ్ కామెంటరీ అవసరం లేదు అంటూ చురకలంటించింది. అంతలో రెండో దశ పూర్తి అయ్యిందని బిగ్ బాస్ ప్రకటించాడు.
మూడోదశలో ఇంటిసభ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో తమ దగ్గర ఉన్న కాయిన్స్ విలువ పెంచుకోవచ్చని సూచించాడు. దాంతో సభ్యుల మధ్య చర్చలు... కెప్టెన్సీ కోసం తమను ఇష్టమైన ఇంటిసభ్యులను కాయిన్స్ ఇవ్వడానికి అంగీకరించారు. అవినాష్ కు దెబ్బతగలడంతో అరియానా అతనికి కొన్ని కాయిన్స్ ఇచ్చి సహాయం చేసింది. లాస్య మాస్టర్ కు కాయిన్స్ తిరిగి ఇచ్చేసింది.
సోహైల్ తనతో తీసుకున్న కాయిన్స్ ఇచ్చేయాలని అమ్మ రాజశేఖర్ అడిగాడు. సరే అంటూ కాయిన్స్ ఇవ్వడానికి సిద్ధమైన సోహైల్‌కు బ్రెయిన్ వాష్ చేశాడు మెహబూబ్. 'ఇది గేమ్. ఇంత కష్టపడి.. అందరి దగ్గరా కొట్టేసి ఇప్పుడు ఇవ్వడం ఎందుకు. ఒక్క పైసా కూడా ఇవ్వకు' అంటూ సోహైల్ కు క్లాస్ ఇచ్చాడు మెహబూబ్.. దాంతో సొంత సోయి లేకుండా సోహైల్ అతని మాటకు సై అన్నాడు. మోనాల్, అఖిల్, సోహైల్ తమ కాయిన్స్ ను మోహబూబ్ కు ఇచ్చేశారు. అందరు తమతమ కాయిన్స్ తీసుకుని గార్డెన్ ఏరియాలోకి రావాలని, ఎవరితో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో లెక్కచెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
![]() |
![]() |