![]() |
![]() |

చిట్టి చెల్లెల్ని లిటిల్ మంకీతో పోల్చింది రష్మిక. తనను చాలా మిస్ అవుతున్నానంటూ చెబుతోంది. సాధారణంగా ఇంటికి దూరంగా ఉన్న వాళ్లు హోమ్ సిక్ అంటుంటారు. రష్మిక కు మాత్రం సిస్టర్ సిక్ అన్నమాట. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన రష్మికకు ఓ చెల్లెలు ఉంది. వయసులో ఆమె కంటే చాలా ఏళ్ల చిన్నది. అందుకని చెల్లెల్ని బాగా గారాబం చేస్తోంది. చెల్లెలు కూడా సరదాగా ఉంటుంది.
కరోనా వల్ల షూటింగులన్నీ షెడ్డుకు వెళ్లడంతో మార్చి నుండి ఓ నాలుగైదు నెలలపాటు రష్మిక ఇంటిలోనే ఉన్నారు. అప్పుడు చెల్లితో బాండింగ్ మరింత బలపడింది. ఇద్దరూ కలిసి తమ పొలాలు, పాడి పశువుల వెంట బాగా తిరిగారు. ఆడుకున్నారు. షూటింగులు మళ్ళీ మొదలు అవుతుండడంతో రష్మిక హైదరాబాద్ వచ్చారు. అందుకని చెల్లెల్ని మిస్ అవుతున్నాను అని చెబుతున్నారు. గత వారంలో ఆమె గోవాకి షాక్ ట్రిప్ కూడా వేశారు.

అల్లు అర్జున్ సరసన రష్మిక కథానాయికగా నటించనున్న తొలి సినిమా 'పుష్ప' షూటింగ్ త్వరలో మొదలు కానుంది. దాని కోసం ఆమె రెడీ అవుతున్నారు.
![]() |
![]() |