![]() |
![]() |

ప్రతిభావంతులైన యాక్టర్లుగా విమర్శకుల ప్రశంసలు పొందిన విజయ్ సేతుపతి, ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటించిన 'కా పే రణసింగమ్' మూవీ గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఓటీటీలో నేరుగా రిలీజయ్యింది. కొద్ది సేపటికే.. రెండు గంటల వ్యవధిలోనే ఆ మూవీని పైరసీ వెబ్‌సైట్ తమిళ్ రాకర్స్ ఆన్‌లైన్‌లో లీక్ చేసింది. ఐదు భాషల్లో రిలీజైన 'కా పే రణసింగమ్' సినిమా 10 అంతర్జాతీయ భాషల్లో సబ్‌టైటిల్స్‌తో రిలీజవడం గమనార్హం. విరుమాండి డైరెక్ట్ చేసిన ఈ ఎమోషనల్ మూవీలో బలమైన సామాజిక అంశాలు కూడా ఉన్నాయి.
కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది జనవరిలోనే దీన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తెలీని కారణాల వల్ల అది జరగలేదు. విజయ్ సేతుపతి, ఐశ్వర్యా రాజేశ్ కలిసి నటించడం ఇది నాలుగోసారి. ఇదివరకు ఆ ఇద్దరూ రమ్మీ, పన్నైయారుమ్ పద్మినీయుమ్, ధర్మా దురైలో కలిసి నటించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన 'కా పే రణసింగమ్'లో రంగరాజ్ పాండే, యోగిబాబు, సముద్రకని కీలక పాత్రలు పోషించారు. సినిమా బాగుందని పేరు వచ్చిన ఆనందం తమిళ్ రాకర్స్ పైరసీతో చిత్ర బృందానికి ఎంతోసేపు నిలవలేదు.
![]() |
![]() |