![]() |
![]() |

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్ కోణాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తున్న దగ్గర్నుంచీ అనేక కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్యలో, 2019లో కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీ వైరల్ వీడియో మరోసారి హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ వైరల్ వీడియోపై ఎన్సీబీ దృష్టి సారించింది. ఆ వీడియోను మరోసారి పరిశీలించే అవకాశం ఉండటంతో, కరణ్ జోహార్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
టైమ్స్ నౌ వార్తా సంస్థ ప్రకారం, ఆ పార్టీకి హాజరైన సెలబ్రిటీలకు ఎన్సీబీ సమన్లు జారీ చేసి, వారిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ సెలబ్రిటీల్లో దీపికా పడుకోనే, అర్జున్ కపూర్, విక్కీ కౌశల్, మలైకా అరోరా, రణబీర్ కపూర్, షాహిద్ కపూర్ తదితరులున్నారు. ఏదేమైనా, ఈ వైరల్ వీడియో కేసుకు సంబంధించి సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసేందుకు ఎన్సీబీ నిర్ణీత గడువు ఏమీ పెట్టుకోలేదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఇప్పటివరకూ తాను ఏ డ్రగ్ పార్టీకి ఆతిథ్యం ఇవ్వలేదనీ, తన పార్టీలో ఎప్పుడూ నిషేధిత డ్రగ్స్‌ను వాడలేదనీ పేర్కొంటూ వస్తున్నాడు. నిజానికి, అలాంటి పార్టీల్లో కరణ్ జోహార్ ఎప్పుడూ పాల్గొనలేదని అతని టీమ్ ఖండించింది.
![]() |
![]() |