![]() |
![]() |

నటి పాయల్ ఘోష్ తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా మూడు వారాలుగా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. అనురాగ్ తనతో అమర్యాదకరంగా ప్రవర్తించాడనీ, తనను బలవంతం చేశాడనీ ఆరోపిస్తూ పాయల్ గత నెలలో ట్వీట్ చేసింది. ఆ తర్వాత మరింత ముందుకు వెళ్లి, ముంబై పోలీసులకు కశ్యప్‌పై ఫిర్యాదు చేసింది. దాంతో ప్రశ్నించడానికి గురువారం పోలీసులు అతడిని పిలిచారు. ఏకంగా 8 గంటల పాటు కశ్యప్‌ను పోలీసులు ప్రశ్నించారనీ, పాయల్ తనపై చేసిన అన్ని ఆరోపణలనూ అతడు ఖండించాడనీ సమాచారం.
సీఎన్ఎన్ న్యూస్ 18 రిపోర్ట్ ప్రకారం, పాయల్ ఆరోపించినట్లు తన వెర్సోవా నివాసంలో ఆమెను ఎన్నడూ కలవలేదని పోలీసులకు కశ్యప్ తెలిపాడు. ప్రొఫెషనల్‌గా మాత్రమే పాయల్ తనకు తెలుసని అతను వెల్లడించాడు. అలాగే, చాలా కాలంగా ఆమెతో మాట్లాడలేదని చెప్పాడు. ముంబై పోలీసులకు పాయల్ పంపిన మెసేజ్‌ల గురించి అతను ప్రశ్నించినట్లు ఆ న్యూస్ చానల్ తెలిపింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సూచనల మేరకే తనను బలవంతం చేసిన కశ్యప్‌పై పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు పాయల్ తెలిపింది. తన ఫిర్యాదుకు సంబంధించి ఆమె ఇటీవల కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలేతో సమావేశమైంది. ఆయన పాయల్‌కు మద్దతు ప్రకటించి, ఆమెకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఆమె తనకు వై ప్లస్ సెక్యూరిటీతో భద్రత కల్పించాలని కోరింది.
![]() |
![]() |