![]() |
![]() |

ఇండియా అతిపెద్ద టీవీ షో బిగ్ బాస్ 14 ప్రారంభానికి నెల రోజులు వాయిదా పడింది. కారణం.. బిగ్ బాస్ హౌస్ సెట్ రిపేర్ పనులు పెండింగ్‌లో పడటం. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈసారి షో లాక్‌డౌన్ థీమ్‌తో నడవనున్నది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ 14వ సీజన్ అక్టోబర్ 3 నుంచి ప్రసారం కానున్నది. లాక్‌డౌన్ కాలంలో జనం చాలా సౌకర్యాలు మిస్సవుతూ వస్తున్నారు. మాల్స్‌లో షాపింగ్ చేయడం, హోటల్‌లో తినడం, థియేటర్‌లో సినిమాలు చూడటం లాంటివి. లక్జరీ టాస్క్‌లలో భాగంగా బిగ్ బాస్ 14 హౌస్‌లో వీటిని ఎంజాయ్ చేసే ఛాన్స్ విజేతలకు దక్కనుంది. టీజర్ వీడియోలో సల్మాన్ ఖాన్ చెప్పినట్లు, 2020కి ఇది సరైన సమాధానం అన్నమాట.
కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ఎలాంటి సౌకర్యాలు, విలాసాలు అనుభవించారో వాటిని కంటెస్టెంట్లకు ఈ సీజన్‌లో అందించనున్నారు. అంటే వాళ్లు మాల్‌ను సందర్శిస్తారు, థియేటర్‌లో కూర్చొని సినిమాలు చూస్తారు, రెస్టారెంట్‌కు వెళ్లి భోంచేస్తారు. ఒక మూవీ థియేటర్‌లో కూర్చొని సల్మాన్ ఖాన్ "అబ్ సీన్ పల్టేగా" అని బిగ్ బాస్ ప్రోమోలో చెప్పింది అందుకే.
బిగ్ బాస్ 14లో నియా శర్మ, ఆకాంక్ష పురి, నిశాంత్ మల్కాని, ఐజాజ్ ఖాన్, నైనా సింగ్, కుమార్ జాను, వివియన్ సేనా వంటి సెలబ్రిటీలు పాల్గొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధ్యాయన్ సుమన్, చాహత్ పాండే, రాజీవ్ సేన్, ఒనిర్ వంటి వాళ్ల పేర్లు కూడా వినిపించినప్పటికీ, అవి కేవలం వదంతులేనని వారు స్పష్టం చేశారు.
![]() |
![]() |