![]() |
![]() |

కంగనా రనౌత్ ముంబైకి రాకూడదని మాట్లాడిన వ్యక్తులలో శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ ఒకరు. ఒకానొక సమయంలో ఆయన హద్దుమీరి అసభ్య పదాన్ని కూడా ఉపయోగించారు. ముంబై లో నివసించే అర్హత కంగనాకు లేదన్నారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ముంబైలో 'మణికర్ణిక' హీరోయిన్ సంతోషంగా జీవించవచ్చని మాట్లాడుతున్నారు. కంగనా రనౌత్ మ్యాటర్ ముగిసిందని సంజయ్ రౌత్ ఒక ఇంటర్వ్యూలో అనడంతో అంతకుముందు ఆయన మాట్లాడిన మాటలు గుర్తు వచ్చిన వాళ్ళు విస్తుపోతున్నారు.
ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీరుగా కంగనా రనౌత్ పోల్చడం పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆమెపై శివ సైనికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, ఆమె ఆఫీస్ ను ముంబై మున్సిపల్ అధికారులు కూల్చివేయడం ఇలాంటివి ప్రతి రోజూ వార్తల్లో వింటున్నాం. చూస్తున్నాం. శివసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బెదిరింపులు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది.
ముంబై ను పాక్ ఆక్రమిత కాశ్మీరుగా కంగనా పోల్చడంతో ఆమెపై తన కోపాన్ని మాత్రమే వ్యక్తం చేశానని తాజా ఇంటర్వ్యూలో సంజయ్ రౌత్ అన్నారు. ముంబై మున్సిపల్ అధికారుల చర్యల తో తనకు ఎటువంటి సంబంధం లేదని, కంగన ఆఫీస్ కూల్చివేత పై మున్సిపల్ అధికారులు అడగాలని ఆయన సూచించారు. మున్సిపల్ అధికారులు చర్యలకు తాను బాధ్యున్ని కాదని చెప్పారు. తాను కంగనాను ఎప్పుడూ బెదిరించ లేదన్నారు. తన వరకు కంగనా మేటర్ ముగిసిందని ఆమె ముంబైలో నివసించవచ్చా అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
![]() |
![]() |