![]() |
![]() |

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమార్ గౌడ సినిమాలలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో తెలుగు, కన్నడ భాషలలో రూపొందిన 'జాగ్వార్' సినిమాతో నిఖిల్ హీరోగా పరిచయమయ్యాడు. అది ఫ్లాప్ కావడంతో కన్నడ సినిమాలపైనే దృష్టి పెట్టాడు. అయితే తెలుగు సినిమా ప్రముఖులతో టచ్లోనే ఉన్నాడు. ఇప్పుడు తెలుగు దర్శకుడితో ఒక సినిమా చేశాడు.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు 'గుండెజారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' తీసిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నిఖిల్ కుమార్ గౌడ ఒక సినిమా చేస్తున్నాడు. దానికి 'రైడర్' టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. రేపు ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా నిఖిల్ కుమార్ గౌడ్ స్ట్రయిట్ తెలుగు సినిమా అని చెప్పుకోవాలి.
![]() |
![]() |