![]() |
![]() |

శేఖర్ కమ్ముల తీసిన 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. అందులో వరుణ్ తేజ్ సరసన ఆమె నటించింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ ఆమె చెంతకు చేరిందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అసలు వివరాల్లోకి వెళితే...
చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం'కి అది రీమేక్. సినిమాలో హీరోకి సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ రోల్ అది. అందులో సాయిపల్లవి నటిస్తే బాగుంటుందని దర్శకుడు మెహర్ రమేష్ భావిస్తున్నారట. ఇటీవల స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన ఆయన, ప్రస్తుతం సాయి పల్లవితో చర్చలు జరుపుతున్నారట. త్వరలో ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం తెలుగులో రానా దగ్గుబాటి సరసన 'విరాట పర్వం', అక్కినేని నాగచైతన్య సరసన 'లవ్ స్టోరీ' సినిమాలలో సాయిపల్లవి నటిస్తోంది.
![]() |
![]() |