![]() |
![]() |

వార్తల్లో తన ఆరోగ్యం గురించి, ఏ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడనే విషయం గురించీ రకరకాల ప్రచారాలు సాగుతున్నప్పటికీ, యాక్షన్-అడ్వంచర్ ఫిల్మ్ 'షంషేరా' షూటింగ్‌కు హాజరయ్యాడు సంజయ్ దత్. 19వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథతో తీస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ డబుల్ రోల్ చేస్తున్నాడు. తమ హక్కులు, స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వాళ్లతో గిరిజనులు చేసే పోరాటం ఈ సినిమా ఇతివృత్తం. కరణ్ మల్హోత్రా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ రోల్‌ను పోషిస్తున్నాడు.
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఇప్పటికే ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. "అందుకే తన వల్ల షూటింగ్ మరింత ఆలస్యం కాకూడదని సంజయ్ భావించాడు. ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నప్పటికీ, ముంబైలోని ఓ స్టూడియోలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, నిబంధనలు పాటిస్తూ జరిపిన షూటింగ్‌కు ఆయన హాజరై తన సన్నివేశాల్ని పూర్తి చేశాడు" అని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
![]() |
![]() |