![]() |
![]() |

ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా 'అసురన్' విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు అందుకుంది. తెలుగులో 'నారప్ప'గా వెంకటేష్ ఆ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'కొత్త బంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి కుటుంబ కథాచిత్రాలు ప్రేక్షకులకు అందించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తునన్నారు. కరోనా మహమ్మారి పంజా విసరకముందు చాలావరకు షూటింగ్ చేశారు. మళ్ళీ దసరాకి ముందు షూటింగ్ రీస్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్‌కి వస్తే... 'అసురన్'లో పాండియన్ పాత్రలో విలన్‌గా నటించిన నితీష్ వీరకి తమిళనాడులో మంచి పేరొచ్చింది. అతడి నటనకు విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభించాయి. 'నారప్ప'లోనూ అతడు నటిస్తున్నాడు. తమిళంలో అతడు ఏ పాత్ర అయితే చేశాడో, తెలుగులో కూడా అదే పాత్ర చేస్తున్నాడు. 'అసురన్'తో నితీష్ వీరకి గుర్తింపు రావడంతో అవకాశాలు వస్తున్నాయి. విజయ్ సేతుపతి, శృతి హాసన్ జంటగా నటించిన 'లాభం'లోనూ అతడు నటించాడు.
![]() |
![]() |