![]() |
![]() |

తెలుగు టీవీ తెరకు గ్లామర్‌ను అద్దిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినప్పటికీ ఆమెను ఇంటిల్లిపాదికీ చేరువ చేసింది మాత్రం టీవీయే. అదుర్స్, సూపర్ సింగర్ 9, జూలకటక, సూపర్ మామ్, పటాస్, జీ సరిగమప వంటి షోలకు హోస్ట్‌గా ఆమె అందరినీ అలరించింది. బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని, చివరి దాకా రాహుల్ సిప్లిగంజ్‌తో పోటీలో నిలిచి, రన్నరప్ ట్రోఫీని గెలుచుకుంది.
అందచందాలకు తోటు చలాకీతనం, సమయస్ఫూర్తితో ఆమె చెప్పే మాటలు, భయపడని తత్వం, అల్లరి వంటివి ఆమెను సక్సెస్‌ఫుల్ హోస్ట్‌గా మార్చాయి. తాజాగా ఆమె మరో కొత్త టాక్ షోతో వ్యూయర్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ షో పేరు 'ఓ వుమనియా!'. అంటే స్త్రీలకు సంబంధించిన షో అన్నమాట. దీని ఫస్ట్ లుక్ ప్రోమో సాంగ్‌ను బుధవారం యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది శ్రీముఖి.

బ్యూటీ, లవ్, ప్యాషన్ (ఫ్యాషన్ కాదు) అంశాల మీద ఈ టాక్ షో ఉంటుందని అందులో తెలిపారు. శ్రీముఖి ఇటు మోడ్రన్‌గా, అటు సంప్రదాయబద్ధంగా డ్రస్సులు ధరించి డాన్సులు చేసింది. అంటే ఈ రెండింటి కలయికగా ఈ షో ఉంటుందని ఊహించవచ్చు. ఈ షో కాన్సెప్ట్ శ్రీముఖిదే.. పైగా ఆమె దీనికి ప్రొడ్యూసర్ కూడా. ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, గ్లామర్ కలయికగా ఈ షో ఉంటుందంట. ఏ చానల్‌లో ఈ షో వస్తుందనేది మాత్రం వెల్లడి చెయ్యలేదు. ఏదేమైనా ఈ సరికొత్త టాక్ షోతో శ్రీముఖి తన అభిమానుల్ని అలరించడం ఖాయం.

![]() |
![]() |