![]() |
![]() |

ప్రజాస్వామ్యం మరణించిందని కంగనా రనౌత్ అన్నారు. ముంబైలోని తన ఆఫీసును మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె ‘డెత్ ఆఫ్ డెమోక్రసీ’ అనే హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేశారు. ‘వై’ కేటగిరీ భద్రత మధ్య ముంబై చేరుకున్న ఆమె, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్ధేశిస్తూ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో సీయంపై నిప్పులు చెరిగారు.
‘‘ఉద్ధవ్ ఠాక్రే... నువ్వేం అనుకుంటున్నావ్? ఫిల్మ్ మాఫియాతో చేతులు కలిపి నా ఆఫీసు కూల్చేయడంతో ప్రతీకారం తీర్చుకున్నావా? ఈ రోజు నా ఇల్లు కూలింది. రేపు నీ అహకారం అణుగుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గుర్తుంచుకో’’ అని కంగనా రనౌత్ హిందీలో మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. తనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మంచి మేలు చేశారని చెప్పుకొచ్చారు. కశ్మీరీ పండిట్ల విషయంలో ఏం జరిగిందో తనకు ఒక ఐడియా ఉందనీ, ఈ రోజు దాన్ని తెలుసుకున్నానని ఆమె అన్నారు. అయోధ్య మీదే కాకుండా కశ్మీర్ మీద కూడా సినిమా తీస్తానని కంగనా రనౌత్ ప్రకటించారు.
మరోవైపు కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేతపై ముంబై హైకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేత అక్రమం అని కంగనా లాయర్ రిజ్వాన్ సిద్ధిఖీ అన్నారు. కూల్చివేతకు కారణమైన వాళ్లపై క్రిమినల్ కేసు ఫైల్ చేస్తామన్నారు. 24 గంటల్లో తన ఆఫీసును అక్రమం అని తేల్చారని కంగనా రనౌత్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫర్నీచర్, లైట్స్‌తో సహా ఆఫీసులో అన్నీ ధ్వంసం చేశారని, బెదిరిస్తున్నారని ఆమె అన్నారు. మూవీ మాఫియా ఫేవరెట్ వరల్డ్ బెస్డ్ సీయం ఉద్ధవ్ ఠాక్రే అని మరోసారి ఆ ట్వీట్‌లో కంగనా ప్రస్తావించారు.
![]() |
![]() |