![]() |
![]() |

'బిగ్ బాస్'లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు. ఓపెనింగ్ రోజున 14మందిని 'బిగ్ బాస్' హౌస్‌లోకి, ఇద్దరు కంటెస్టెంట్లు సోహైల్, అరియనాను పక్కన ఉన్న మరో హౌస్‌లోకి పంపించారు. రెండు రోజులు నైబర్ హౌస్‌లో ఉన్న ఆ ఇద్దరూ మంగళవారం రాత్రి మెయిన్ హౌస్‌లోకి వచ్చారు.
"మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. తిండి కూడా పెట్టలేదు కనుక మీరే తేల్చుకోండి" అని సోహైల్, అరియనాను మెయిన్ హౌస్‌లోకి బిగ్ బాసే పంపాడు. వాళ్ళకు, మిగతా 14మందిలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' హీరో అభిజిత్‌కి మధ్య గొడవ అయినట్టు ప్రోమోలో చూపించారు. బుధవారం... అనగా ఈ రోజు గొడవ ఏమాత్రం జరిగింది? ఏమైంది? అనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి.
జనాలకు తెలియనివాళ్ళు, ఊరూపేరూ లేనివాళ్ళను ఎంపిక చేశారని ఈ ఏడాది సెలబ్రిటీల సెలక్షన్ మీద విమర్శలు రావడంతో గొడవలు, ఏడుపులు పెడబొబ్బల మీద టీఆర్పీలు రాబట్టాలని ప్లాన్ చేసినట్టు ఉన్నారు. తొలి రెండు మూడు రోజుల్లో అవే హైలైట్ అయ్యాయి.
![]() |
![]() |