![]() |
![]() |

కరోనా మహమ్మారి దెబ్బకు టాలీవుడ్‌లోని సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోవడంతో, సూపర్ స్టార్ మహేశ్ బాబు మార్చి నుంచి ఫిల్మ్‌నగర్‌లోని తన విలాసవంతమైన బంగళా నుంచి కాలు బయట పెట్టకుండా గడుపుతూ వస్తున్నాడు. ఆర్నెల్ల తర్వాత ఒక యాడ్ షూటింగ్ నిమిత్తం ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో బుధ, గురువారాలు ఆ యాడ్ షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నాడు.
బుధవారం మహేశ్ యాడ్ షూట్ సెట్స్‌పై ఉన్న ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ పిక్చర్‌లో ఎల్లో కలర్ షర్ట్, బ్రౌన్ కలర్ ట్రౌజర్స్, వైట్ స్పోర్ట్స్ ధరించి ఉన్నాడు మహేశ్. షాట్ గ్యాప్‌లో చైర్‌లో రిలాక్స్‌డ్‌గా కూర్చొని కాఫీ తాగుతూ, డైరెక్టర్‌తో కబుర్లు చెబుతున్నాడు. కాఫీ కప్పు పట్టుకున్న చేతిలోనే ఫేస్ మాస్క్ కూడా కనిపిస్తోంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్ నిర్వహిస్తున్నారని ఫొటోలో పీపీఈ కిట్లు ధరించిన సిబ్బందిని బట్టి అర్థమవుతోంది. సెట్స్‌పై పరిమిత సంఖ్యలో యూనిట్ మెంబర్స్, డిజిన్‌ఫెక్టెంట్ టన్నెల్స్, షోషల్ డిస్టాన్సింగ్ వంటి నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే, 'సరిలేరు నీకెవ్వరు' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పరశురామ్ డైరెక్షన్‌లో 'సర్కారు వారి పాట' మూవీని అంగీకరించాడు మహేశ్. త్వరలో దాని షూటింగ్ మొదలు కానున్నది.
![]() |
![]() |