![]() |
![]() |

అన్‌లాక్ 4లో కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు అనుమతి నివ్వడంతో టాలీవుడ్‌లో వరుసగా ఒక్కొక్క సినిమా షూటింగ్ పునఃప్రారంభమవుతూ వస్తోంది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సెలబ్రిటీలు, సినిమా యూనిట్ షూటింగ్‌లు చేస్తున్నారు. స్టార్ హీరోలలో మొదటగా నాగార్జున 'వైల్డ్ డాగ్' మూవీ షూటింగ్‌ను రెజ్యూమ్ చేయగా, ఆయన తనయుడు నాగచైతన్య 'లవ్ స్టోరి' సెట్స్ మీదకు వచ్చాడు. అలాగే క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా సెట్స్‌పై వైష్ణవ్ తేజ్ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఎంటరైంది.
తాజాగా హైదరాబాద్ రోడ్ల మీద వెంకీ మామ సుందరి పాయల్ రాజ్‌పుత్ నడచుకుంటూ వెళ్తూ కెమెరాలకు చిక్కింది. అయితే అది ఓ సినిమా షూటింగ్ నిమిత్తం. అది ఏ సినిమా షూటింగ్ అనేది వెల్లడి చేయకుండా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సెట్స్‌పై ఉన్న తన పిక్చర్‌ను షేర్ చేసింది పాయల్. స్లీవ్‌లెస్ నేవీ బ్లూ కుర్తా, వైట్ చుడీదార్‌లో ఆమె గార్జియస్‌గా కనిపిస్తోంది. స్పాట్ బాయ్ గొడుగు పట్టుకోనుండగా ఫేస్ మాస్క్ ధరించిన పాయల్ రోడ్డుపై నడుచుకుంటూ వస్తోంది. పక్కనే ఆటోలు కనిపిస్తున్నాయి.

ఇటీవల బాలానగర్‌లోని తన నివాసం వద్ద గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ఈ అందాల తార.. రవితేజ, ప్రగ్యా జైస్వాల్‌లను నామినేట్ చేసింది.
![]() |
![]() |