![]() |
![]() |

కంగనా రనౌత్, శివసేన పార్టీ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకీ ముదురుతోంది. ఏకంగా కంగనా రనౌత్ మహారాష్ట్ర అసెంబ్లీలో హాట్ టాపిక్ అయింది. డ్రగ్స్‌తో ఆమెకు సంబంధం ఉందని అసెంబ్లీలో ఒక ప్రస్తావన వచ్చింది.
ఆల్రెడీ ముంబైలోని కంగనా రనౌత్ ఆఫీసు సక్రమ నిర్మాణం కాదంటూ మంగళవారం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అంటించారు. మరోవైపు అసెంబ్లీలో ఆమెకు డ్రగ్స్ తో లింకులు ఉన్నాయని ప్రస్తావన వచ్చింది. దీనిపై కంగనారనౌత్ మండిపడింది.
నటుడు శేఖర్ సుమన్ కుమారుడు కంగనా రనౌత్ తన మాజీ లవర్ అధ్యాయన్ సుమన్ ఒక ఇంటర్వ్యూలో కంగనా డ్రగ్స్ తీసుకున్నదని చెప్పిన విషయాన్ని శివసేన ఎమ్మెల్యేలు ప్రతాప్ సర్నాయక్, సునీల్ ప్రభు అసెంబ్లీలో ప్రస్తావించారు. అందుకు బదులుగా ముంబై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ సమాధానం ఇచ్చారు. దానిపై కంగనా సీరియస్ అయ్యారు. తనకు పరీక్షలు నిర్వహించవచ్చుననీ, తాను డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ముంబై వెళ్ళిపోతాను అని ట్వీట్ చేసారు.
![]() |
![]() |