![]() |
![]() |

బిగ్ బాస్ 4లో తొలి కంటెస్టెంట్‌గా వచ్చి ఆశ్చర్యపరిచింది మోనాల్ గజ్జర్. అసలు ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తుందని ముందస్తుగా ఎవరూ ఊహించలేదు. అల్లరి నరేశ్ జోడీగా 'సుడిగాడు' వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మోనాల్.. ఆ తర్వాత ఆశించిన రీతిలో అవకాశాలు పొందలేకపోయిన మాట నిజం. అయితే మాతృభాష గుజరాతీలో ఆమె ఇవాళ మంచి పేరున్న హీరోయిన్. నటి కాకముందు మోడల్‌గా రాణించింది మోనాల్.
1991లో ఆమె అహ్మదాబాద్‌లో జన్మించింది. అమ్మంటే తనకు ప్రాణమని చెప్పే ఆమె తరచూ ఆమెతో అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. సినిమాల్లోకి వచ్చినప్పుడు అమ్మే తనకు తోడు నీడగా ఉండి, తనకు ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకుంటూ వచ్చిందని చెప్తుంది మోనాల్.
చాలా మందికి తెలీని విషయం, సినిమాల్లోకి రాకముందు ఆమె ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ ఎంప్లాయీ. ఆ తర్వాత మోడలింగ్‌లోకి ఎంటరై మిస్ గుజరాతీ టైటిల్‌ను సైతం గెలుచుకుంది. 2012లో 'సుడిగాడు' మూవీతో సుడిగాలిలా ఎంట్రీ ఇచ్చింది మోనాల్. ఆ వెంటనే మలయాళ చిత్రసీమలోనూ అడుగుపెట్టి 'డ్రాకులా 2012' మూవీతో అక్కడా తన ముద్ర వేసింది. 2018లో నేషనల్ అవార్డ్ పొందిన గుజరాతీ మూవీ 'రేవాలో' నటనకు అందరి ప్రశంసలూ లభించాయి.

మోనాల్ గజ్జర్ ఆస్తుల విలువ 'ట్రెండ్స్ సెలబ్స్ నౌ' ప్రకారం 1 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. ఆమెకు ఆదాయం లభిస్తోంది ఎక్కువగా గుజరాతీ సినిమాల్లో నటించడం ద్వారానే. మధ్య మధ్యలో తెలుగు, తమిళ, మలయాళం సినిమాల్లోనూ నటిస్తూ సంపాదిస్తోంది.
తెలుగులో మోనాల్ నటించిన చిత్రాలు:
సుడిగాడు (2012)
వెన్నెల 1 1/2 (2012)
ఒక కాలేజ్ స్టోరీ (2013)
బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ (2014)
దేవదాసి (2017)
![]() |
![]() |