![]() |
![]() |

'బిగ్ బాస్ 4' మొదలైంది. ఆల్రెడీ రెండు రోజులు గడిచింది. షో ఎలా నడుస్తున్నదనేది పక్కన పెడితే... ఈ సీజన్ కోసం తీసుకొచ్చిన సెలబ్రిటీల మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సీజన్ సీజన్‌కి 'బిగ్ బాస్'లో సెలబ్రిటీల స్టాండర్డ్స్ పడుతున్నాయని కామెంట్లు చేశారు. వైల్డ్ కార్డు ద్వారా రేంజ్ ఉన్న సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపించి షో రేంజ్ పెంచుతారో లేదో తరవాత తెలుస్తుంది. ఇప్పటికి అయితే ఆల్రెడీ షోలోకి వచ్చిన సెలబ్రిటీలతో ప్రేక్షకులు సరిపెట్టుకోవాలి.
రోజుకి పదివేలు మాత్రమే తీసుకొనే ఆర్టిస్టులతో షో రన్ చేస్తున్నారని టీవీ ఇండస్ట్రీ గుసగుస. తక్కువ ఖర్చుతో స్టార్ మా ఛానల్ ఈ ఏడాది షోను ముగించాలని అనుకున్నదని, అందుకే ఎక్కువ డబ్బులు తీసుకొనే సెలబ్రిటీల జోలికి వెళ్లలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 'బిగ్ బాస్ 4'లో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న సెలబ్రిటీ యాంకర్ లాస్య మంజునాథ్ అని టాక్.
లాస్యకు 'బిగ్ బాస్ 4' నిర్వాహకులు రోజుకి లక్ష రూపాయలు ఇస్తున్నారట. యాంకరింగ్ నుండి బ్రేక్ తీసుకుని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయినా లాస్యకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఇటీవల మళ్ళీ షోలు చేయడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అందుకని, ఆమెకు అంత మొత్తం ఇస్తున్నాడట.
![]() |
![]() |