![]() |
![]() |

మూడు రోజుల ఇంటరాగేషన్ తరవాత హీరోయిన్ రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఆమె అరెస్ట్‌కు సంబంధించిన పేపర్ వర్క్ పూర్తయింది. ఏయే సెక్షన్ల కింద ఆమెను అరెస్ట్ చేశారనేది తెలియాల్సి ఉంది. వివరాలు ఇంకా విడుదల చేయలేదు. రియా అరెస్ట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ కమీషనర్ కెపిఎస్ మల్హోత్రా ధృవీకరించారు. మంగళవారం మెడికల్ టెస్ట్‌ల కోసం ఆమెను నార్కోటిక్స్ ఆఫీసు నుండి హాస్పటల్‌కు తీసుకువెళ్లారు.
తాను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పడంతో పాటు లేట్ బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి డ్రగ్స్ ఇచ్చినట్టు రియా చక్రవర్తి అంగీకరించిందని బాలీవుడ్ గుసగుస. అయితే, గతంలో డ్రగ్స్ తీసుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. అవసరం అయితే బ్లడ్ టెస్ట్‌లు చేసుకోమని ఆమె లాయర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం లేదనీ, ఆరెస్ట్‌కు రియా రెడీగా ఉన్నారని నార్కోటిక్స్ దర్యాప్తు మొదలైన తరవాత ఆయన అన్నారు. ఆల్రెడీ బయటకొచ్చిన వాట్సాప్ ఛాట్‌లో ‘హార్డ్ డ్రగ్’ అని ఉండటంతో దాని ఆధారంగా నార్కోటిక్స్ ఇంటరాగేషన్ చేయడం ప్రారంభించింది.
ఇప్పటికే ఈ కేసులో రియా సోదరుడు షోవిక్‌ను నార్కోటిక్స్ బృందం అరెస్ట్ చేసింది. ఆ తరవాత రేపో మాపో తన కూతురిని అరెస్ట్ చేస్తారని రియా చక్రవర్తి తండ్రి అన్నారు. ఆయన ఊహించినట్టే ఈ రోజు అరెస్ట్ జరిగింది.
![]() |
![]() |