![]() |
![]() |

జనసేన పార్టీ ప్రారంభించి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్, కొంత విరామం తరవాత నటిస్తున్న సినిమా 'వకీల్ సాబ్'. హిందీ హిట్ 'పింక్'కి రీమేక్ ఇది. అందులో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రను తెలుగులో పవన్ చేస్తున్నారు. అది తెలిసి అభిమానులు కొందరు నిరుత్సాహానికి గురయ్యారు. అమితాబ్ వయసు ఎక్కువ. ఆయన చేసిన పాత్ర చేయటమేమిటని అనుకున్నారు. అయితే, తమిళంలో ఈ సినిమాను అజిత్ రీమేక్ చేశారు. అక్కడ ఆయన వయసుకు తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశారు.
తెలుగులో పవన్ కల్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని 'పింక్' మూలకథ మార్చకుండా హీరోయిజమ్ సన్నివేశాలు జోడించామని, మార్పులు చేశామని నిర్మాత 'దిల్' రాజు చెప్పిన మాటలు అభిమానులకు సంతోషాన్ని ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కూడా కమర్షియల్ ఎలిమెంట్లు బాగా యాడ్ చేశారన్నట్టు ఉన్నాయి. దర్శకుడు శ్రీరామ్ వేణు మాత్రం 'వకీల్ సాబ్' అవుట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదని చెప్పారు. ప్రతి మహిళను గౌరవించేలా ఉంటుందనీ, కథలో మైనర్ చేంజెస్ చేశామని అన్నారు. డిసెంబర్ కల్లా 'వకీల్ సాబ్' ఫస్ట్ కాపీ రెడీ అవుతుందట. సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి.
![]() |
![]() |