![]() |
![]() |

కట్టప్ప... మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టుబానిస. శివగామి ఆజ్ఞను శిరసావహించి బాహుబలి ప్రాణాలు తీసిన బానిస. కట్టప్ప పాత్రలో తమిళ నటుడు సత్యరాజ్ జీవించారు. 'బిగ్ బాస్'లోకి సత్యరాజ్ రాలేదు. మరి, 'బిగ్ బాస్'లో కట్టప్ప అంటున్నారు ఏంటి? అనుకుంటున్నారా!
ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్ లో 14 మంది కంటెస్టెంట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు బిగ్ బాస్ హౌస్ పక్కన ఉన్న నైబర్ హౌస్ లో ఉన్నారు. అయితే, అందులో ఒక కట్టప్ప ఉన్నారని మొదటిరోజు ఎపిసోడ్ కి ఎండింగ్ ట్విస్ట్ ఇచ్చారు. దాంతో టీవీ ప్రేక్షకుల్లో రెండో రోజు ఏమవుతుందని ఆసక్తి ఏర్పడింది. ఈరోజు కట్టప్ప ఎవరు అని క్లారిటీ ఇస్తారేమో!
షో పరంగా చూసుకుంటే మొదటి రోజు కాస్త ఎంటర్టైనింగ్, ఎమోషనల్ మెలోడ్రామాతో సాగిందని చెప్పాలి. కంటెస్టెంట్ లు అందరూ హుషారైన పాటలకు డ్యాన్సులు వేశారు. తర్వాత కరాటే కళ్యాణి ఏడుపులు పెడబొబ్బలు తో సగటు సీరియల్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా కాసేపు షో సాగింది.
![]() |
![]() |